LIVE
 సుఖోయ్ ప్రమాదం.. ఆపరేషన్ సింధూర్ పైలట్ మృతి
వెనక్కి

సుఖోయ్ ప్రమాదం.. ఆపరేషన్ సింధూర్ పైలట్ మృతి

44 రోజుల క్రితం
సారాంశం

సుఖోయ్ యుద్ధ విమానం కూలిపోయిన ఘటనలో ఇద్దరు పైలట్లు మృతిచెందారు. ఈ ప్రమాదంలో ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొన్న పైలట్ కూడా మృతి చెందారు. ఈ విమాన ప్రమాదంలో ఇద్దరు పైలట్లు మృతి చెందగా, వారిలో ఒకరు ఫ్లైట్ లెఫ్టినెంట్ పూర్వేశ్ దురాగ్‌కర్ ఉన్నారు. ఆయన ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొన్నారు. పూర్వేశ్ మృతి చెందడంతో నాగపూర్‌లోని వారి కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. పూర్వేశ్ తండ్రి రవీంద్ర దురాగ్‌కర్ రిటైర్డ్ రైల్వే ఉద్యోగి. బుధవారం రోజే కుమారుడితో మాట్లాడామని, కానీ ఇంతలోనే ఈరోజు గ్రూప్ కెప్టెన్ ఫోన్ చేసి ఈ ప్రమాదం గురించి తెలియజేశాడని రవీంద్ర కంటతడిపెట్టారు. దేశం కోసం యుద్ధ విమానాలను నడిపిన తన కుమారుడిని చూసి గర్విస్తున్నానని పేర్కొన్నారు.

షేర్ చేయండి:
6 మార్చి, 2026 03:13 PMకి